బిగ్ టికెట్.. ఏపీ వాసిని వరించిన Dh150,000..!!
- August 13, 2025
యూఏఈ: బిగ్ టికెట్ ది బిగ్ విన్ కాంటెస్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 42 ఏళ్ల మొబైల్ షాప్ యజమాని అస్లాం షేక్ ను అధృష్టం వరించింది. అతను 150,000 దిర్హనును గెలుపొందాడు. 2007 నుండి తన కుటుంబంతో కువైట్‌లో నివసిస్తున్నాడు షేక్. ఆరు నెలల క్రితమే తన స్నేహితుల ద్వారా బిగ్ టికెట్ గురించి తెలిసినట్లు తెలిపాడు. తాను నిజంగా చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. ఏడుగురు స్నేహితుల బృందంలో భాగంగా క్రమం తప్పకుండా టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నట్లు, గ్రూప్ సభ్యులతో బహుమతిని సమానంగా పంచుకుంటానని తెలిపాడు.
షేక్ తోపాటు మొత్తం నలుగురు వ్యక్తులు 510,000 దిర్హంలను గెలుపొందారు. వారిలో కేరళకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి స్మిరేష్ అతిక్కున్ను పరంబిల్ కుంచన్ Dh120,000 గెలుచుకున్నారు. అల్యూమినియం ఫ్యాబ్రికేషన్‌లో పనిచేస్తున్న అతడు, గత 17 సంవత్సరాలుగా అల్ ఐన్‌లో నివసిస్తున్నాడు. ఆరు నెలల క్రితం, అతను 16 మంది స్నేహితుల బృందంతో కలిసి టిక్కెట్లు కొనడం ప్రారంభించినట్లు తెలిపాడు. బహుమతిలో తనకు దక్కే వాటాతో కుటుంబాన్ని పోషించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. వీరితోపాటు మరో భారతీయ ప్రవాసుడు ఫిరోజ్ ఖాన్ ఆన్‌లైన్ టికెట్‌తో Dh140,000 గెలుచుకున్నాడు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







