ఒమన్ ఖరీఫ్ ధోఫర్ సూపర్ సక్సెస్..పోటెత్తిన టూరిస్టులు..!!
- August 13, 2025
సలాలా: ఒమన్ లోని ఖరీఫ్ ధోపర్ కు పర్యాటకులు పోటెత్తారు. 21 జూన్ నుండి 31 జూలై వరకు ఖరీఫ్ ధోఫర్ సీజన్‌ను సందర్శించిన వారి సఖ్య సుమారు 442,100 కు చేరుకుంది, గతేడాది కంటే 7 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాథమిక అంచనాలను వివరించారు.
ఒమానీ సందర్శకుల సంఖ్య 75.6 శాతానికి పెరిగి 334,399 కు చేరుకుంది. అదే సమయంలో GCC దేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య 69,801 కాగా, ఇతర దేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య 37,900గా ఉంది.
జూలై చివరి నాటికి మొత్తం 334,846 మంది సందర్శకులు ధోఫర్ గవర్నరేట్‌కు తరలివచ్చారు. జూలై చివరి నాటికి ఖరీఫ్ ధోఫర్ సీజన్‌కు వచ్చిన సందర్శకులలో 95.3% మంది జూలై 1 నుంచి జూలై 31 మధ్య వచ్చారని, 4.7% మంది 21 జూన్ 2025 మరియు 30 జూన్ 2025 మధ్య వచ్చారని గమనించాలి.
తాజా వార్తలు
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!







