తిరుమలలో వసతి పేరిట 30 నకిలీ వెబ్ సైట్లు
- August 13, 2025
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి ఆన్‌లైన్‌లో టికెట్లు అందిస్తున్నట్టు చూపించి, సైబర్ నేరగాళ్లు భక్తులను మోసం చేస్తున్నారు. గెస్ట్‌హౌస్‌లు, వసతి బుకింగ్‌లు పేరుతో నకిలీ వెబ్‌సైట్లు ఏర్పాటుచేసి డబ్బులు వసూలు చేస్తున్నారు.ఈ మోసాలకు అడ్డుకట్ట వేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు 28 నకిలీ వెబ్‌సైట్లు తొలగించారు. మిగతావి కూడా తొలగించేందుకు ప్రక్రియ కొనసాగుతోంది.సప్తగిరి, నందకం, పద్మావతి గెస్ట్‌హౌస్ వంటి పేర్లతో నకిలీ సైట్లు రూపొందించి భక్తులను విశ్వసింపజేస్తున్నారు. కానీ, ఈ సైట్లు టీటీడీకి ఎలాంటి సంబంధం ఉండదని పోలీసులు స్పష్టం చేశారు.భక్తులు http://www.tirumala.org అనే టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు, వసతి, సేవలు పొందాలని స్పష్టంగా సూచిస్తున్నారు. దీనికంటే ఇతర ఏ వెబ్‌సైట్‌నూ నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!