మినిమమ్ బ్యాలెన్స్ తగ్గించిన ICICI బ్యాంక్

- August 13, 2025 , by Maagulf
మినిమమ్ బ్యాలెన్స్ తగ్గించిన ICICI బ్యాంక్

ముంబై: దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్, సేవింగ్స్ ఖాతాలపై తీసుకున్న నిర్ణయాన్ని బదిలీ చేసింది. కొద్దిరోజుల కిందట కనీస సగటు బ్యాలెన్స్ (MAB) మొత్తాన్ని భారీగా పెంచిన బ్యాంక్‌కు వినియోగదారుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి.బ్యాంక్ తాజా ప్రకటన ప్రకారం, నగరాల్లో కొత్త ఖాతాదారుల కోసం MAB రూ. 50,000 నుంచి రూ.15,000కు తగ్గింది (Rs.50,000 reduced to Rs.15,000).ఇది గణనీయమైన తగ్గుదల. ఎందుకంటే, గతంలో ఇది కేవలం రూ.10,000 మాత్రమే ఉండేది. ఒక్కసారిగా దాన్ని అయిదింతలు పెంచడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.ఇప్పుడు కనీస బ్యాలెన్స్ రూ.15,000గా నిర్దేశించడంపై కూడా కొంత అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఇది పాత మొత్తంతో పోలిస్తే ఇంకా రూ. 5,000 ఎక్కువే. అయినా, బ్యాంక్ మొదటి నిర్ణయంతో పోలిస్తే ఇది ఊపిరి పీల్చే మార్పే అని చెప్పాలి.

పట్టణ ప్రాంతాల్లో కూడా బ్యాంక్ మెరుగైన నిర్ణయం తీసుకుంది. అక్కడ రూ.25,000 నుంచి రూ. 7,500కి కనీస బ్యాలెన్స్ తగ్గించడం జరిగింది.ఈ నిర్ణయం వలన మధ్య తరగతి వినియోగదారులు ఎంతో ఊరటతో ఉన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న రూ.5,000 కనీస బ్యాలెన్స్ నిబంధనలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. బ్యాంక్ ప్రకారం, పాత ఖాతాదారులపై ఈ కొత్త మార్పులు వర్తించవు.ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇప్పటికే  2020లోనే సేవింగ్స్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ అవసరాన్ని తొలగించింది. అనేక ప్రైవేట్ బ్యాంకులు రూ.2,000 నుంచి రూ.10,000 మధ్యే పరిమితి పెట్టాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com