ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు ప్రమాణ స్వీకారం
- August 14, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో నలుగురు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.రాష్ట్ర హైకోర్టులో ఇప్పటి వరకూ అదనపు న్యాయమూర్తులుగా పని చేస్తున్న జస్టిస్ హరినాధ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ (కిరణ్మయి కనపర్తి), జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్‌లను న్యాయమూర్తులుగా నియమిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు.ఆ ఆదేశాలకు అనుగుణంగా బుధవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొదటి కోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆనలుగురు అదనపు న్యాయమూర్తులచే న్యాయమూర్తులుగా ప్రమాణం స్వీకారం చేయించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్,ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షులు కె.చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ, అదనపు అడ్వకేట్ జనరల్ పి. సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీ నారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారధి, పలువురు ఇతర రిజిస్ట్రార్లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు,ఏపీ లీగల్ సర్వీసెస్ అధారిటీ,ఏపీ జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







