దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త

- August 15, 2025 , by Maagulf
దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభవార్తను చెప్పారు. ప్రజలకు జీఎస్టీ తగ్గించనున్నట్లు చెప్పారు.దీపావళి లోపు తదుపరి జనరేషన్ జీఎస్టీ అమలులోకి తీసుకొస్తామని మోదీ తెలిపారు. దీంతో ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందని, దీపావళికి ప్రజలకు డబుల్ బొనాంజా ఇస్తాం అని మోదీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ దేశ సైనికులకు తన అభినందనలు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ యుద్ధ సమయంలో మనదేశ సైనికులు తమ ప్రాణాలను తెగించి, పాకిస్తాన్ పై యుద్ధం చేశారని కొనియాడారు. స్వాతంత్ర్యం కోసం అనేకులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, అలాగే సైనికులు కూడా దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేశారని మోదీ గుర్తు చేసుకున్నారు. వారి కష్టార్జితం వల్లే మనం శాంతియుతంగా జీవించగలుగుతున్నామని మోదీ సైనికులను ప్రశంసలతో అభినందించారు.ఢిల్లీలోని ఎర్రలోటలో మోదీ జాతీయ జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com