రేపు NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సమావేశం

- August 16, 2025 , by Maagulf
రేపు NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సమావేశం

న్యూ ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దేశరాజకీయాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామాతో అనూహ్యపరిణామాలు చోటు చేసుకున్నాయి. జగదీప్ రాజీనామాను రాష్ర్ట పతి ద్రౌపతి ముర్ము ఆమోదించడం, తదుపరి ఉపరాష్ట్రపతి కోసం ఎన్డీఏ వేగంగా పావులను కదుపుతున్నది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ESI) తేదీలు ఖరారు చేయడంతో చరిత్రలో ఇది రెండవ మధ్యంతర ఉపరాష్ట్రపతి ఎన్నికగా నిలుస్తుంది.

బీజేపీలోని అత్యున్నత నిర్ణయాత్మక విభాగం (బీజేపీ పార్లమెంటరీ బోర్డు) ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం రేపు (ఆదివారం) సాయంత్రం 6గంటలకు సమావేశం కానున్నది. దీంతో ఉపరాష్ట్రపతి రేసులో ఎవరున్నారన్న చర్చ ఊపందుకుంది. ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమికి చెందిన అభ్యర్థే గెలుపొందే అవకాశాలు ఉన్నందున ఆ కూటమిలో జరుగుతున్న కసరత్తు ఆసక్తికరంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ నిర్ణయాధికారాన్ని కట్టబెడుతూ తీర్మానం కూడా చేశారు. ప్రతిపక్ష పార్టీ అయిన ఇండియా కూటమి కూడా తనవంతు కసరత్తు చేస్తున్నది. ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే అంశంపై తర్జనభర్జనలు పడుతున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com