సౌదీయేతరుల డిజిటల్ ID వినియోగానికి సౌదీ అరేబియా ఆమోదం..!!

- August 16, 2025 , by Maagulf
సౌదీయేతరుల డిజిటల్ ID వినియోగానికి సౌదీ అరేబియా ఆమోదం..!!

రియాద్: సౌదీయేతర, ప్రవాస విదేశీయులు ప్రాపర్టీని కొనుగోలు చేసేందుకు వీలుగా సౌదీ అరేబియా మంత్రివర్గం డిజిటల్ ID వినియోగాన్ని ఆమోదించింది. సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సౌదీ డేటా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ ,  జాతీయ సమాచార కేంద్రం మరియు ఇతర సంబంధిత సంస్థలతో సమన్వయం డిజిటల్ ఐడీలను యాక్టివేట్ చేస్తున్నట్లు జనరల్ రియల్ ఎస్టేట్ అథారిటీ వెల్లడించింది.  సౌదీయేతర రియల్ ఎస్టేట్ యాజమాన్య చట్టం అమలుకు ఇది దోహదం చేస్తుందన్నారు.

సౌదీయేతరుల ప్రాపర్టీ మేనేజ్ మెంట్, వినియోగ హక్కులపై ఆర్థిక మరియు అభివృద్ధి వ్యవహారాల మండలి తీసుకున్న నిర్ణయాన్ని కూడా సౌదీ అరేబియా కేబినెట్ ఆమోదించింది.  ఈ విషయాలను పర్యవేక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇందులో వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు మరియు ముగ్గురు ప్రైవేట్ రంగ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. 

కాగా, జూలై నెలలో సౌదీయేతర రియల్ ఎస్టేట్ యాజమాన్య చట్టాన్ని మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే.  ఇది జనవరి 2026 నుండి అమలులోకి వస్తుంది. దీని ప్రకారం నివాసితులు కాని విదేశీయులు అబ్షర్ ప్లాట్‌ఫామ్ ద్వారా డిజిటల్ IDని పొందాల్సి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com