తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ఎప్పటినుంచంటే..?

- August 17, 2025 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ఎప్పటినుంచంటే..?

ఈ ఏడాది అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు దసరా సెలవులు భారీగా లభించనున్నాయి. సాధారణంగా దసరా పండుగకు ఒక వారం పాటు సెలవులు ఇస్తారు. కానీ ఈసారి శనివారాలు, ఆదివారాలు, పండుగలు కలిసిపోవడంతో విద్యార్థులు మరింత ఎక్కువ రోజులు విశ్రాంతి పొందనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్లకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ప్రకటించారు.అదనంగా క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేకంగా హాలీడేస్ ఉండనున్నాయి.ఈ కాలంలో విద్యార్థులు తొమ్మిది రోజులు పూర్తి విశ్రాంతి పొందనున్నారు.ఆంధ్ర ప్రదేశ్ టూరిజం

తెలంగాణ రాష్ట్రంలో మాత్రం విద్యార్థులకు ఇంకా ఎక్కువ రోజుల దసరా సెలవులు లభించనున్నాయి.సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు కొనసాగనున్నాయి. అంటే మొత్తం పదమూడు రోజులు విద్యార్థులు తరగతులకు హాజరు కాకుండా విశ్రాంతిని ఆస్వాదించనున్నారు.

దసరా సెలవుల సమయంలో మధ్యలో వచ్చే ఆదివారాలు, రెండో శనివారాలు మరియు ప్రత్యేక పండుగ రోజులు కూడా కలవడంతో విద్యార్థులకు ఈసారి మరింత ఎక్కువ హాలీడేస్ దొరకనున్నాయి. దీంతో ఇంట్లో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం, బంధువుల వద్దకు వెళ్లడం, పండుగ వేడుకల్లో పాల్గొనడం లాంటి అవకాశాలు విద్యార్థులకు లభించనున్నాయి.

ఈ ఏడాది అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మొత్తం 233 వర్కింగ్ డేస్ ఉండగా, ఇప్పటికే ప్రకటించిన పండుగలు, ఆదివారాలు, దసరా సెలవులు కలిపి 83 రోజులు స్కూళ్లకు సెలవులు వస్తాయి. దీంతో పాఠశాలల విద్యా కార్యక్రమాలకు ఆటంకం లేకుండా సెలవులను సమన్వయం చేసేలా విద్యాశాఖ ప్లాన్ వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com