కువైట్‌లో అక్రమ మద్యం ఉత్పత్తి–అమ్మకాల పై భారీ దాడులు: 67 మంది అరెస్టు
- August 17, 2025
కువైట్ సిటీ: కువైట్‌లో అక్రమ మద్యం సేవించి జరిగిన విషాదకర మరణాల తర్వాత, దేశవ్యాప్తంగా పోలీసులు విస్తృత స్థాయిలో దాడులు చేపట్టారు.ఈ క్రమంలో 24 గంటలు నిరంతరాయంగా సాగిన ఆపరేషన్‌లో 67 మంది అక్రమ మద్యం తయారీ మరియు విక్రయాలలో పాల్గొన్నవారిని అరెస్టు చేశారు.
దాడుల సందర్భంగా అధికారులు 10 అక్రమ మద్యం కర్మాగారాలను గుర్తించి సీజ్ చేశారు. అరెస్టయిన వారిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్, నేపాల్, భారత దేశాలకు చెందిన వారిగా గుర్తించారు.
ఈ ఆపరేషన్‌ను మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా ప్రత్యక్ష పర్యవేక్షణలో అధికారులు విజయవంతంగా నిర్వహించారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!