కువైట్‌లో భారీ రైడ్స్: 10 యూనిట్లు సీజ్..60 మంది అరెస్టు..!!
- August 17, 2025
కువైట్: కువైట్ లో నకిలీ మద్యం తాగి పలువురు మరణించిన నేపథ్యంలో కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా ఆదేశాల మేరకు, భద్రతా అధికారులు పెద్ద ఎత్తున పలు ప్రాంతాల్లో రైడ్స్ చేశారు. ఈ సందర్భంగా 10 నకిలీ మద్యం యూనిట్లను గుర్తించి సీజ్ చేశారు. వీటితో సంబంధం ఉన్న దాదాపు 67మందిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యానికి సంబంధించిన ఒక ప్రధాన నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో నిర్మూలించినట్లు అధికారులు తెలిపారు.
మిథనాల్ వినియోగం ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని, ఇది తరచుగా మరణాలకు దారితీస్తుందని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పింది. మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







