సౌదీ అరేబియాలో వారంరోజుల్లో 22వేల మంది అరెస్టు..!!

- August 17, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో వారంరోజుల్లో 22వేల మంది అరెస్టు..!!

రియాద్: సౌదీ అరేబియాలో భద్రతా అధికారులు గత వారం రోజుల్లో 21,997 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేశారు. ఆగస్టు 7 - 13 తేదిల మధ్య కాలంలో సంబంధిత ప్రభుత్వ సంస్థల సహకారంతో భద్రతా దళాలు నిర్వహించిన సంయుక్త తనిఖీల సందర్భంగా ఈ అరెస్టులు జరిగాయని సౌదీ అరేబియా హోం మినిస్ట్రీ వెల్లడించింది. అరెస్టు అయిన వారిలో 13,434 మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించినవారు, 4,697 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించినవారు, 3,866 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉన్నారు.

సౌదీ అరేబియా బార్డర్ క్రాస్ చేస్తూ 1,787 మంది పట్టుబడగా, వీరిలో 35 శాతం యెమెన్ జాతీయులు, 64 శాతం ఇథియోపియన్ జాతీయులు ఉండగా, ఒక శాతం ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు.  అరెస్టయిన వారిపై అమల్లో ఉన్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సౌదీలోకి అక్రమ వచ్చేందుకు సహాయం చేసిన వారికి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించడంతోపాటు వన్ మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధిస్తామని  హెచ్చరించారు. అనుమానిత కేసులను మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా, మిగిలిన ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా నివేదించాలని సౌదీ అరేబియా హోం మినిస్ట్రీ పిలుపునిచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com