దుబాయ్ ఎయిర్ పోర్టులో కొత్త AI కారిడార్..!!
- August 18, 2025
యూఏఈః దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఇప్పుడు AI-ఆధారిత కారిడార్‌కు నిలయంగా ఉంది. ఇది ప్రయాణికులు సెకన్లలోపు ఇమ్మిగ్రేషన్ పూర్తిచేసి వెళ్ళడానికి వీలు కల్పిస్తుంది.కొత్త AI కారిడార్ ద్వారా ఒకేసారి 10 మంది గుర్తింపు పత్రాలను స్కాన్ చేస్తుంది. ఇప్పుడు ఎయిర్ పోర్ట్ ఏఐ వ్యవస్థలు క్రాసింగ్‌ల వద్దకు రాకముందే ప్రయాణీకుల డేటాను గుర్తిస్తాయని దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు.
కొత్త AI-ఆధారిత కారిడార్ ద్వారా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను వేగవంతం చేస్తుందన్నారు. ఎయిర్ పోర్ట్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుందని అన్నారు. ఏదైనా అనుమానాస్పద పాస్‌పోర్ట్‌ను గుర్తించడంలో కొత్త ఏఐ వ్యవస్థ సహాయపడుతుందని అల్ మర్రి చెప్పారు. కాగా, ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ నివేదిక ప్రకారం, 2024 లో అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ పరంగా దుబాయ్ ఎయిర్ పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్ట్ తన స్థానాన్ని నిలుపుకుంది.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!