ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి..

- August 19, 2025 , by Maagulf
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి..

న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచేందుకు ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే అధ్యక్షతన ఇవాళ ఉదయం కూటమి పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశం తరువాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా సుందర్శన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పీసీ రాధాకృష్ణన్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

ఇండియా కూటమి అభ్యర్థిగా సుందర్శన్ రెడ్డి పేరు ప్రకటన సందర్భంగా మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. బి. సుదర్శన్ రెడ్డి భారతదేశంలో అత్యంత విశిష్టమైన, ప్రగతిశీల న్యాయ నిపుణుల్లో ఒకరని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారని చెప్పారు. న్యాయవాద వృత్తిలో సుదీర్ఘ అనుభవం కలిగిన సుదర్శన్ రెడ్డి.. పేదల పక్షపాతిగా, రాజ్యాంగం, ప్రాథమిక హక్కులను కాపాడడంలో ఎంతో కృషి చేశారని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com