వామ్డ్ సర్వీస్ దుర్వినియోగంపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ హెచ్చరికలు..!!
- August 19, 2025
కువైట్: వామ్డ్ సర్వీస్ దుర్వినియోగంపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ హెచ్చరికలు జారీ చేసింది. కొంతమంది కస్టమర్లు వామ్డ్ తక్షణ చెల్లింపు కింద రోజువారీ బదిలీ పరిమితులను దాటేందుకు అక్రమ పద్ధతులను ఎంచుకుంటున్నారని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తెలిపింది. ఈ దుర్వినియోగాన్ని ఆపడానికి బ్యాంకులకు సెంట్రల్ బ్యాంక్ కొత్త సర్క్యులర్ జారీ చేసింది.
వామ్డ్‌పై నియంత్రణలను కఠినతరం చేయాలని కోరింది. కస్టమర్లు నిర్దేశించిన పరిమితులను మించకుండా బ్యాంకులు ఇప్పుడు తమ వ్యవస్థలను సర్దుబాటు చేసుకోవాలని, రోజువారీ పరిమితిని దాటిన ఏవైనా బదిలీలు నిరోధించాలని సూచించింది. చెల్లింపు వ్యవస్థ దుర్వినియోగాన్ని నిరోధించడానికి సెంట్రల్ బ్యాంక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తుందని స్పష్టం చేసింది.
నిబంధనల ప్రకారం, వామ్ద్ బదిలీలు ప్రతి లావాదేవీకి 1,000 కువైట్ దినార్లకు పరిమితం చేశారు. రోజువారీ గరిష్టంగా మూడు వేల కువైట్ దినార్లు మరియు నెలవారీ గరిష్టంగా 20వేల కువైట్ దినార్ల పరిమితులు విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!