బహ్రెయిన్ లో ఉద్యోగ బదిలీకి గైడ్ లైన్స్.. LMRA రిమైండర్..!!

- August 19, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో ఉద్యోగ బదిలీకి గైడ్ లైన్స్.. LMRA రిమైండర్..!!

మానామా: బహ్రెయిన్ లో ప్రవాస కార్మికులు ఒక యజమాని నుండి మరొక యజమానికి చట్టబద్ధంగా ఎలా బదిలీ కావచ్చో లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ స్పష్టమైన గైడ్ లైన్స్ తో రిమైండర్ జారీ చేసింది.   

కొత్త యజమాని ఎక్స్పాట్రియట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (EMS) ద్వారా వర్క్ పర్మిట్ అభ్యర్థనను సమర్పించడం ద్వారా బదిలీ ప్రక్రియను ప్రారంభించాలి. కాగా, ప్రస్తుత యజమాని ఉద్యోగి రాజీనామాను అందుకున్నారని రుజువు చేయడం తప్పనిసరి. LMRA మరియు సంబంధిత సంస్థలు దరఖాస్తును ప్రస్తుత యజమానికి ఫార్వార్డ్ చేసే ముందు సమీక్షిస్తాయి.

కార్మికుడు ప్రస్తుత యజమాని వద్ద ఒక సంవత్సరం కంటే తక్కువ కాలం పనిచేసి ఉంటే, యజమాని బదిలీ అభ్యర్థనను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అయితే, కార్మికుడు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పూర్తి చేసి ఉంటే, ప్రస్తుత యజమాని ఆ దరఖాస్తును తిరస్కరించలేడు. అయితే,  చట్టానికి అనుగుణంగా నోటీసు వ్యవధిని నిర్ణయించడానికి అధికారం కలిగి ఉంటారు.  సాధారణంగా 30 రోజులు లేదా ఒప్పందాన్ని బట్టి 90 రోజుల వరకు వ్యవధిని కోరవచ్చు.

 చివరగా దరఖాస్తు ఆమోదం పొందితే, కార్మికుడు కొత్త యజమాని వద్ద చేరవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం ఎలక్ట్రానిక్ పద్ధతిలో పారదర్శకంగా జరిగిపోతుందని గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com