ఏసీలు, టీవీలు మరింత చౌకగా.. కేంద్రం సంచలన నిర్ణయం..!

- August 19, 2025 , by Maagulf
ఏసీలు, టీవీలు మరింత చౌకగా.. కేంద్రం సంచలన నిర్ణయం..!

న్యూ ఢిల్లీ: జీఎస్టీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 28 శాతం GST స్లాబ్ నుండి ఎయిర్ కండిషనర్లు (ACలు) తొలగించి 18 శాతం GST స్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రతిపాదించింది.

ప్రభుత్వ ఈ ప్రతిపాదనతో గృహోపకరణాలను తయారు చేసే కంపెనీలు రాబోయే పండుగల సమయంలో మంచి అమ్మకాలను ఆశిస్తున్నాయి. జీఎస్టీ సంస్కరణ అమలు తర్వాత వివిధ మోడళ్లను బట్టి ఏసీల ధరలు రూ.1500 నుండి రూ.2500 వరకు తగ్గుతాయి. ప్రభుత్వం ఇటీవల ఆదాయపు పన్నును తగ్గించడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును సవరించిన తర్వాత ధరలలో ఈ తగ్గింపు జరగబోతోంది.

టీవీలు కూడా చౌకగా..

ఈ నిర్ణయం తర్వాత ఏసీలకు ప్రాముఖ్యత పెంచడమే కాకుండా ‘ప్రీమియం AC’లకు డిమాండ్‌ను పెరుగుతుంది. ఇక్కడ ప్రజలు ఖర్చు ప్రయోజనాల కారణంగా తక్కువ విద్యుత్తును వినియోగించే మోడళ్లను కొనుగోలు చేస్తారు. దీనితో పాటు 32 అంగుళాల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న టీవీలపై జీఎస్టీ స్లాబ్‌ను ప్రస్తుత 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడంలో టీవీలు చౌకగా మారనున్నాయి.

కంపెనీల స్పందన ఏమిటి?

దీనిని గొప్ప నిర్ణయంగా అభివర్ణిస్తూ.. బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి. త్యాగరాజన్ ప్రభుత్వం ఈ మార్పులను త్వరగా అమలు చేయాలని కోరారు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు రూమ్‌ ఎయిర్ కండిషనర్లు (RAC) కొనుగోలు చేసే ముందు నిర్ణయం అమలు కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఆగస్టులో ఎవరూ AC కొనరు, వారు సెప్టెంబర్ లేదా అక్టోబర్ 1 వరకు వేచి ఉంటారని త్యాగరాజన్ అన్నారు.

ఏసీలు రూ.1500 నుంచి రూ.2500 వరకు చౌకగా..

పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా చైర్మన్ మనీష్ శర్మ మాట్లాడుతూ.. ఇంధన సామర్థ్యం గల ఉత్పత్తులపై పరిశ్రమ దాదాపు 12 శాతం జీఎస్టీ, మిగిలిన ఉత్పత్తులపై 18 శాతం జీఎస్టీని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే ఏసీలు, ఇతర ఉపకరణాలపై GSTని 28 నుండి 18 శాతానికి తగ్గించిన పరిస్థితిలో మార్కెట్‌లో ధరలు నేరుగా 6-7 శాతం తగ్గుతాయి. ఎందుకంటే సాధారణంగా జీఎస్టీ బేస్ ధరపై విధించనున్నారు. అందుకే ఇది అపూర్వమైనది అని ఆయన అన్నారు. దీని వలన మోడల్‌ను బట్టి తుది వినియోగదారునికి ACల ధర రూ.1,500 నుండి రూ.2,500 వరకు తగ్గుతుందని శర్మ అన్నారు.

అదేవిధంగా భారతదేశంలో AC అమ్మకాలు ఇప్పటికీ చాలా తక్కువగా ఉందని, ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే కేవలం 9-10 శాతం మాత్రమే ఉందని గోద్రేజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది అన్నారు. తక్కువ జీఎస్టీ వల్ల ఏసీలు మరింత సరసమైనవిగా మారతాయి. అనేక కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ.. 32 అంగుళాల కంటే పెద్ద స్మార్ట్ టీవీలపై జీఎస్టీ తగ్గించడం వల్ల అమ్మకాలు 20 శాతం పెరుగుతాయని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com