ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ కొత్త నిబంధనలు..
- July 18, 2016
త్వరలోనే అమల్లోకి రానున్న ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ కొత్త నిబంధనలు దేశీయ విమాన యాన సంస్థలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతుండగా విమాన ప్రయాణికులకు భారీ పరిహారం కోసం లభించనుంది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త పాలసీలో ప్రయాణికుల లగేజీ ఛార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రిత్వ శాఖ ఒకవేళ విమానం క్యాన్సిల్ అయితే టికెట్ ధరతో పాటు అదనపు పన్నుల రూపంలో వసూలు చేసే ఛార్జీలు కూడా చెల్లించాలని చెప్పింది.ఇకపై విమానం ఆలస్యమైనా....రద్దయినా ఆయా విమానయాన సంస్థ సదరు ప్రయాణికులకు భారీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది. రెండుగంటల లోపు విమానం రద్దయితే 10వేల రూపాయలు చెల్లించాలి. దీంతోపాటుగా 24 గంటల లోపు వేరే విమానాన్ని సమకూర్చలేకపోతే మరో రూ.20వేలు పరిహారం చెల్లించాల్సిందేనని విమానాయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. టికెట్ క్యాన్సిల్ అయితే అదనపు పన్నులతో సహా చార్జీలను ప్రయాణికులకు రీఫండ్ చేయాలని చెప్పింది.ఈ రీఫండ్ కూడా దేశీయ ప్రయాణాలకైతే 15 రోజుల్లోగా, అంతర్జాతీయంగా అయితే 30 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది.అయితే ఈచెల్లింపుల ప్రక్రియలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయనీ, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం వుందని ఎయిర్ పాసింజర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డి. సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ విధానం పారదర్శకంగా లేదనీ, కొన్ని అంశాలపై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయన్నారు. నిజాలను నిర్ధారించిన బాధ్యత ఆయా విమాన సంస్థలపై పెట్టడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. కాగా ఇటీవల విమానాయాన మంత్రిత్వ శాఖ ఆమోదించిన కొత్త విధానం విమాన ప్రయాణికులకు శుభవార్త అందించింది. లగేజీ చార్జీల తగ్గింపు తోపాటు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







