తాను తెలంగాణను వదలలేదన్న ఏపీ ముఖ్యమంత్రి..
- July 18, 2016
తాను తెలంగాణను వదలలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీపీ తెలంగాణ నేతల భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. నాయకుల పనితీరుపై ప్రతినెల నివేదిక తెప్పించుకుంటానని, అంతమాత్రాన ఆంధ్రా నుంచి దిశానిర్దేశం చేసినట్టు భావించొద్దని ఆయన కోరారు. సొంత నిర్ణయాలతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, అంతేకాని ప్రతి దానికి ఏపీతో పోల్చుకోవద్దని టీటీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్థేశం చేశారు. ఏపీలో సెన్సార్ విధానంతో పథకాల అమలును పరిశీలిస్తున్నామని, మీ పనితీరును అలాగే తెలుసుకుంటానని సరదాగా అన్ననని బాబు చెప్పారు. భేటీ సమయంలోనే టీటీడీపీ నేతలకు విశాఖలో ఎల్ఈడీ బల్బుల సిస్టం పనితీరుపై సెన్సార్ విధానాన్ని ల్యాప్‌ట్యాప్‌లో చూపించారు. అందులో 90 వేల బల్బుల్లో 45 వేలు వెలుగుతున్నాయని కనిపించిందని తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







