వైన్స్ షాపుల కోసం దరఖాస్తు ఫీజు 3 లక్షలు
- August 21, 2025
హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం షాపుల టెండర్ల కోసం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. నవంబర్ 30 తో ప్రస్తుత వైన్స్ షాపుల గడువు ముగియనుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త పాలసీని అమల్లోకి తెచ్చేందుకు ప్రభు త్వం గెజిట్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వైన్ షాపులకు దరఖాస్తులు స్వీకరించనుంది. గతంలో రూ. 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును మూడు లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటిం చింది. దీని ద్వారా 3,500 కోట్ల రూపాయల ఆదాయం సర్కారుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదు వేల లోపు జనాభా ఉన్న హ్యా బిటేషన్లకు సంబంధించి 50 లక్షల రూపాయల ఫీజును వసూలు చేయాలని నిర్ణయించింది. 50 వేల నుంచి లక్ష లోపు జనాభా ఉంటే రూ. 60 లక్షలు, లక్ష నుంచి ఐదు లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకు 65 లక్షల రూపాయలు, ఐదు లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలు, 20 లక్షల కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కోటీ పది లక్షల రూపాయల లైసెన్సు ఫీజు వసూలు చేయ నున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రి 11 గంటల వరకు, గ్రామాల్లో రాత్రి 10 గంటల వరకు వైన్స్ లు తెరిచి ఉంచాలని నిబంధన కూడా పెట్టింది. వైన్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు సైతం పాటించనున్నారు. గౌడ్స్ కు 15% రిజర్వేషన్లు, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5% రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. దర ఖాస్తుల ద్వారానే భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







