ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి .
- July 18, 2016
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోడీని ఆయన ఆహ్వానించారు.
తాగు నీటి ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత సమస్యగా మారిన హైకోర్టు విభజనపై త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీని కోరారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పలు ప్రాజెక్టులకు కేంద్రం ఇతోధకంగా నిధులు ఇవ్వాలని కోరారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు నిధులివ్వాలని కోరారు. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలో ద్వారా పరిష్కారం కాని సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని ఆయన ప్రధాని మోడీతో చర్చించారు. దీంతో పాటు తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, పలు అంశాలపై జోక్యం చేసుకోవాలని ఆయన ప్రధానిని కోరారు.
సాగర్‌లో వినాయక నిమజ్జనం ఉండదు: హైకోర్టుకు తేల్చిచెప్పిన కేసీఆర్ ప్రభుత్వం
ఈ ఏడాది హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం ఉండదని కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. వినాయక విగ్రహాల నిమజ్జనంపై కోర్టులో విచారణ జరుగగా, నిమజ్జన ప్రక్రియను ప్రత్యేక చెరువుల్లో మాత్రమే చేపడతామని స్పష్టం చేసింది. నిమజ్జనానికి హుసేన్ సాగర్‌ను వాడబోమని తేల్చి చెప్పింది.
ప్రత్యామ్నాయాలను ఇప్పటికే గుర్తించామని, ఈ మేరకు నిమజ్జనం ఊరేగింపు మార్గాలను ఎక్కడివక్కడ మార్చనున్నామని పేర్కొంది. ప్రత్యేక చెరువులను గుర్తించామని, అక్కడ కూడా నిమజ్జనం తరువాత వ్యర్థాల తొలగింపును శరవేగంగా పూర్తి చేస్తామని హైకోర్టుకు తేల్చి చెప్పింది.ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీపై భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఘాటుగా స్పందించింది. సాగర్‌ను వాడుకోరాదని హైకోర్టు చెప్పలేదని, అన్ని చెరువుల్లో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని సూచిస్తూ ఇచ్చిన ఆదేశాల కాపీ తన వద్ద ఉందని కమిటీ నేత భగవంతరావు స్పష్టం చేశారు.తెలంగాణ ప్రభుత్వ వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదాయప్రకారం హుస్సేన్ సాగర్‌లోనే ప్రధాన నిమజ్జనం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఉదయం హైకోర్టులో వినాయక నిమజ్జనం కేసు వాదనకు రాగా, కేసీఆర్ ప్రభుత్వం నిమజ్జనానికి సాగర్‌ను వాడబోమని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







