ఈ వారాంతంలో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!

- August 21, 2025 , by Maagulf
ఈ వారాంతంలో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!

కువైట్: నేషనల్ అసెంబ్లీ కూడలి నుండి సీఫ్ ప్యాలెస్ రౌండ్అబౌట్ వైపు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ ని పూర్తిగా మూసివేస్తున్నట్లు కువైట్ జనరల్ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. ఈ మూసివేత ఆంక్షలు ఆగస్టు 21 సాయంత్రం 4:00 గంటల నుండి అమలులోకి వస్తాయని, ఆగస్టు 24 ఉదయం 6:00 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు.

వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవాలని.. రద్దీని నివారించడానికి ట్రాఫిక్ సూచనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com