తమ్కీన్ చొరవ.. 56% మంది జీతాలను పెంచిన బాలెక్స్ కో..!!
- August 21, 2025
మనామా: తమ్కీన్ తీసుకొచ్చిన వేతన పెంపు కార్యక్రమం ద్వారా బహ్రెయిన్ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ కంపెనీ (బాలెక్స్ కో) తన బహ్రెయిన్ ఉద్యోగులలో 56% మంది జీతాలను పెంచింది. ఉద్యోగులు 5శాతం నుండి 20 శాతం వరకు ఇంక్రిమెంట్లను పొందారు.
ప్రైవేట్ రంగంలో బహ్రెయిన్ల నియామకం, తగిన నైపుణ్యాలతో వారిని సన్నద్ధం చేయడంతోపాటు ఎంటర్ప్రైజ్ అభివృద్ధి, డిజిటలైజేషన్ కు ప్రాధాన్యత ఇవ్వడం, కార్మిక మార్కెట్ , ప్రైవేట్ రంగాన్ని చుట్టుముట్టే సమస్యలకు తగిన పరిష్కారం చూపడంపై టమ్‌కీన్ పనిచేస్తుంది.
బాలెక్స్ కో కు ఫైనాన్సింగ్, సిబ్బంది శిక్షణలో మద్దతు వంటి వివిధ కార్యక్రమాల ద్వారా టమ్‌కీన్ గత కొన్ని సంవత్సరాలుగా కీలక పాత్ర పోషించింది. ఇది కంపెనీ ఉత్పాదకతను గణనీయంగా పెంచాయి. పారిశ్రామిక రంగంలో వృద్ధిని నడిపించాయి, బాలెక్స్ కో బహ్రెయిన్సేషన్ రేటును 65%కి పెంచాయి. 1977లో స్థాపించబడిన బాలెక్స్ కో గల్ఫ్ ప్రాంతంలో మొట్టమొదటి అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ప్లాంట్.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







