వాట్సాప్ బదులు రష్యా కొత్త యాప్
- August 22, 2025
విదేశీ యాప్‌లపై ఆధారపడకుండా స్వంత సాంకేతికతను అభివృద్ధి చేసుకునే లక్ష్యంతో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. చైనా తరహాలోనే, దేశీయ డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రష్యా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.ఇకపై రష్యాలో అమ్మే ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన యాప్‌లు ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలి. ఇది ఇక చట్టబద్ధమైన నిబంధనగా మారనుంది. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం రూపొందించిన మెసెంజర్ యాప్ ‘మ్యాక్స్’ కీలక పాత్ర పోషించనుంది.ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా రష్యా ‘మ్యాక్స్’ (‘Max’) యాప్‌ను తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ ‘వి.కె’ అభివృద్ధి చేసిన మెసెంజర్. ప్రభుత్వం అన్ని కొత్త మొబైల్స్, టాబ్లెట్లలో ఈ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలని స్పష్టంగా తెలిపింది.
‘మ్యాక్స్’ ద్వారా కేవలం మెసెజింగ్ కాకుండా, ప్రభుత్వ సేవలందనునట్లు అధికారులు చెప్పారు. దీని ద్వారా పౌరులు ప్రభుత్వ ప్రకటనలు, సేవల సమాచారాన్ని తేలికగా పొందగలుగుతారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని అభివృద్ధి చేశారు.సెప్టెంబర్ 1 నుంచి రష్యాలో అమ్మే ప్రతి కొత్త ఐఫోన్‌లో ‘రూ స్టోర్’ అనే దేశీయ యాప్‌స్టోర్ తప్పనిసరిగా ఉండాలి. యాపిల్ ఉత్పత్తులకు ఇది ఒక కొత్త షరతు. విదేశీ యాప్‌స్టోర్లపై ఆధారాన్ని తగ్గించేందుకు ఇదే రష్యా వ్యూహం.వచ్చే ఏడాది నుంచి అమ్మే ప్రతి కొత్త స్మార్ట్ టీవీలో ‘లైమ్ హెచ్‌డి టీవీ’ యాప్ తప్పనిసరి. ఈ యాప్ ద్వారా ప్రజలు ప్రభుత్వ టీవీ ఛానళ్లను ఉచితంగా చూడొచ్చు. దేశీయ మీడియా ప్రోత్సాహానికి ఇది ఒక పెద్ద అడుగు.
ఈ మార్గంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ప్రభుత్వ యాప్‌లు యూజర్ల డేటాను గమనించవచ్చని విమర్శకులు ఆందోళన చెందుతున్నారు. అయితే, రష్యా ఈ ఆరోపణలను ఖండించింది. మ్యాక్స్ యాప్ నిఘాకు వీలిచ్చే విధంగా లేదు. ఇది వాట్సాప్ కన్నా తక్కువ అనుమతులతో పనిచేస్తుంది అని అధికారులు తెలిపారు.ఈ చర్యలతో రష్యా తన డిజిటల్ రంగంలో విదేశీ ఆధిపత్యాన్ని తగ్గించాలనే సంకల్పాన్ని స్పష్టంగా చూపించింది. దేశీయ యాప్‌లు, సేవల అభివృద్ధికి ఇది మంచి అవకాశం. దీన్ని డిజిటల్ స్వాతంత్య్రం సాధనగా చూసుకోవచ్చు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్‌లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్‌లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్‌లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్‌నగర్‌లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







