'డ్యూడ్' ఫస్ట్ సింగిల్ బూమ్ బూమ్ ఆగస్ట్ 28న రిలీజ్
- August 23, 2025
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'డ్యూడ్'లో నటిస్తున్నారు. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ఈ చిత్రం యువతకు నచ్చే ఎంటర్టైనర్ గా ఉండనుంది. ప్రదీప్‌కు జోడీగా "ప్రేమలు" ఫేమ్ మమిత బైజూ కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రదీప్ రంగనాథన్, మమిత బైజూకు ఫస్ట్‌లుక్ పోస్టర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. 'డ్యూడ్' ఫస్ట్ సింగిల్ బూమ్ బూమ్ ఆగస్ట్ 28న రిలీజ్ కానుంది. సాంగ్ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో ప్రదీప్ రంగనాథన్, మమిత బైజూ ట్రెండీ అండ్ స్టయిలీష్ లుక్ లో ఆకట్టుకున్నారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్‌గా, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.
తారాగణం: ప్రదీప్ రంగనాథన్, శరత్ కుమార్, మమిత బైజు, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కీర్తిశ్వరన్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
CEO: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ యెర్నేని
సంగీతం: సాయి అభ్యంకర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు
కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి
ఎడిటర్: బరత్ విక్రమన్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







