కువైట్ లో రోడ్లపై వాహనాలను వదిలేస్తున్నారా? జాగ్రత్త..!!

- August 23, 2025 , by Maagulf
కువైట్ లో రోడ్లపై వాహనాలను వదిలేస్తున్నారా? జాగ్రత్త..!!

కువైట్ : కువైట్ మునిసిపాలిటీ వాహనదారులను హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, స్ట్రీట్స్ లలో తమ వాహనాలను వదిలివేయవద్దని సూచించింది. ఇటువంటి పద్ధతుల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని, అలాగే తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని తెలిపింది.  ఇలా రోడ్లపై వదిలేసిన వాహన యజమానులకు KD 100 వరకు జరిమానా విధించబడుతుందని మునిసిపాలిటీ హెచ్చరించింది. వీటితోపాటు వాహనాన్ని యార్డ్ నుండి తొలగించే వరకు అయ్యే రవాణా ఖర్చులు,  రోజువారీ ఇంపౌండ్‌మెంట్ రుసుములను చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వాహనదారులు నిబంధనలను పాటించాలని మరియు నిర్దేశిత ప్రాంతాలలో వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com