తెలుగు ఇండియన్ ఐడల్ 4 ప్రోమో వచ్చేసింది..
- August 23, 2025
హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను తీసుకువస్తూ ఉంటుంది.
తెలుగు ఇండియన్ ఐడల్ అంటూ లోకల్ సింగర్స్, తెలుగు వాళ్ళ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి షోని తీసుకొచ్చి ఎంతో మంది గాయనీగాయకులను పరిచయం చేసింది.
ఈ షో విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక నాలుగో సీజన్‌తో అలరించేందుకు సిద్ధమైంది.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఆగస్టు 29 నుంచి ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ప్రొమోను విడుదల చేశారు. జడ్జీలుగా తమన్, కార్తీక్, గీతా మాధురిలు వ్యహరిస్తుండగా..శ్రీరామచంద్రతో పాటు సింగర్ సమీరా సైతం హోస్టింగ్ చేస్తున్నట్లుగా అర్థమవుతోంది.
ఈ ప్రొమోలో కంటెస్టెంట్లు తమ పాటలతో జడ్డీలను మెప్పించే ప్రయత్నం చేశారు. ఒకరిని మించి మరొకరు పాడినట్లుగా అర్థమవుతోంది. మిరాజ్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో తేజ సజ్జా సైతం సందడి చేశాడు. మొత్తంగా ప్రొమో అదిరిపోయింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







