అవి ఫేక్..పుకార్లను ఖండించిన యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ..!!

- August 23, 2025 , by Maagulf
అవి ఫేక్..పుకార్లను ఖండించిన యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ..!!

యూఏఈ: యూఏఈలో స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో అధికారిక పాఠశాల సమయాలను మారుస్తున్నారని సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తలపై విద్యా మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. కిండర్ గార్టెన్‌లతో సహా ఏ స్థాయిలోనూ పాఠశాల సమయాలను మార్చడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో షేర్ అవుతున్న సమాచారం ఫేక్ అని, దానిని ఎవరూ నమ్మవద్దని తెలిపింది.  ఈ విషయంపై తన అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఎటువంటి ప్రకటనలను ప్రచురించలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com