వాట్సాప్, పెన్‌డ్రైవ్‌లు నిషేధం

- August 25, 2025 , by Maagulf
వాట్సాప్, పెన్‌డ్రైవ్‌లు నిషేధం

జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.సైబర్ భద్రతను మరింత పటిష్టం చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.ఇప్పటి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెన్ డ్రైవ్‌ ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది.ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తోంది.సోమవారం జరిగిన అధికారిక ప్రకటనలో ఈ నిషేధాన్ని ప్రకటించారు.సివిల్ సెక్రటేరియట్‌లోని అన్ని పరిపాలనా విభాగాలు, జిల్లాల డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల్లో ఇది వర్తిస్తుంది.ఈ ఉత్తర్వులను జీఏడీ కమిషనర్ సెక్రటరీ ఎం. రాజు జారీ చేశారు.

పెన్ డ్రైవ్‌ల వాడకం వల్ల ప్రభుత్వ గోప్యమైన సమాచారం ప్రమాదంలో పడుతోంది. డేటా చోరీ, మాల్‌వేర్ దాడులు, అనధికార యాక్సెస్ లాంటి సమస్యలు పెరుగుతున్నాయి.ఈ సమస్యలను తగ్గించడమే ఈ నిబంధనల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.పెన్ డ్రైవ్‌లతో పాటు వాట్సాప్, Telegram లాంటి పబ్లిక్ మెసేజింగ్ యాప్స్‌ను కూడా వాడవద్దని స్పష్టం చేశారు.ఇలాంటివి అధికారిక డాక్యుమెంట్ల కోసం ఉపయోగించకూడదు.ఐలవ్‌పీడీఎఫ్ (ILovePDF) వంటి భద్రత లేని వెబ్‌సైట్‌ల నుంచి కూడా ఫైళ్లను పంపడం, డౌన్‌లోడ్ చేయడం పూర్తిగా నిషేధించారు.అత్యవసరమైతే, పరిపాలనాధిపతి అనుమతితో ఎన్ఐసీ ద్వారా పెన్ డ్రైవ్‌లకు తాత్కాలిక అనుమతి తీసుకోవచ్చు.ఇది కూడా కఠినమైన నియమాల ప్రకారం జరగాలి. అనుమతి పొందిన పెన్ డ్రైవ్‌ను ఫిజికల్‌గా NIC సెల్‌కి పంపించి, తనిఖీ చేయించాలి.

తరువాత మాత్రమే ఉపయోగించాలి.

  • ‘GovDrive’ – భద్రతతో కూడిన క్లౌడ్ సొల్యూషన్.
  • పెన్ డ్రైవ్‌లకు బదులుగా ప్రభుత్వం కొత్త పరిష్కారాన్ని సూచించింది.
  • అదే GovDrive అనే క్లౌడ్ ఆధారిత ప్లాట్‌ఫారమ్.
  • ఇది ప్రతీ అధికారికి 50GB స్టోరేజ్‌ను ఉచితంగా అందిస్తుంది.
  • ఎక్కడినుంచైనా భద్రతతో ఫైళ్లను యాక్సెస్ చేసుకోవచ్చు.
  • ఫైళ్లను భద్రంగా భద్రపరచడానికి ఇది ఉత్తమ ఎంపిక.

ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.ఇది సాధారణ సూచన కాదని, తప్పనిసరిగా పాటించాల్సిన నియమం అని స్పష్టం చేసింది.ఈ మార్గదర్శకాలు అన్ని శాఖలు, విభాగాలకు వర్తిస్తాయి. సురక్షితమైన ఈ-గవర్నెన్స్‌కి ఇది చాలా కీలకం.డిజిటల్ యుగంలో డేటా రక్షణ అనేది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతగా ప్రభుత్వం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com