భారత్‌లో ఆ ప్రాంతాలే లక్ష్యంగా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసులు..
- August 25, 2025
న్యూ ఢిల్లీ: స్టార్ లింక్ అతి త్వరలో భారత్ కు రాబోతుంది. ఎలోన్ మస్క్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ స్టార్‌లింక్ దేశంలో ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభించబోతోంది. భారత ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆమోదం లభించింది.
అయితే, త్వరలో సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫైబర్, ఇతర మార్గాల ద్వారా కనెక్టివిటీ అందుబాటులో లేని ప్రాంతాలలో ఇంటర్నెట్ సర్వీసును అందించనుంది. స్టార్ లింక్ ధర ఎంత? శాటిలైట్ ఇంటర్నెట్ ఎంత స్పీడ్ ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఎంత ఖర్చవుతుంది?
భారత మార్కెట్లో సర్వీసులను ప్రారంభించాలంటే స్టార్‌లింక్ నెట్‌వర్క్ గేట్‌వే, స్పెక్ట్రమ్ లైసెన్స్ పొందాల్సి ఉంది. అలాగే మరికొన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ రాబోయే కొన్ని నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.
స్టార్‌లింక్ సర్వీసు కోసం అవసరమైన సెటప్ కిట్ ధర దాదాపు రూ.30వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం..రూ.30వేల నుంచి రూ.35వేల మధ్య ఉండవచ్చు. నెలవారీ ప్లాన్ ధర దాదాపు రూ.3,300 నుంచి ప్రారంభమై రూ.4,200 వరకు ఉండవచ్చు. ఈ ధర లొకేషన్, వినియోగాన్ని బట్టి మారవచ్చు.
ఇంటర్నెట్ స్పీడ్ ఎంతంటే?
స్టార్‌లింక్ ఇంటర్నెట్ స్పీడ్ 25Mbps నుంచి 220Mbps మధ్య ఉంటుందని అంచనా. పట్టణ ప్రాంతాల్లో ఫైబర్ ఇంటర్నెట్ వాడే వారికి ఈ స్పీడ్ అందుబాటులో ఉంటుంది. కానీ, గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు గేమ్-ఛేంజర్‌గా ఉంటుంది. ఇంటర్నెట్ ఇప్పటికీ అందుబాటులో లేని ప్రాంతాలకు ఈ సర్వీసు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో స్టార్‌లింక్ అందుబాటులోకి వస్తే ఇతర పోటీదారులను అధిగమించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పట్టణ ప్రాంతాల్లో స్టార్ లింక్ వినియోగం పరిమితంగా ఉండొచ్చు.
ఏ టెక్నాలజీపై పనిచేస్తుందంటే?
స్టార్‌లింక్ తక్కువ భూమి కక్ష్య (LEO)లో ఉన్న శాటిలైట్లను ఉపయోగిస్తుంది. ఈ శాటిలైట్లు భూమికి కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాయి. సాధారణ శాటిలైట్ల కన్నా చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీసును అందిస్తుంది.
స్టార్‌లింక్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7వేల శాటిలైట్లను కలిగి ఉంది. ప్రపంచంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించేందుకు ఈ సంఖ్యను 40వేల కన్నా ఎక్కువకు పెంచాలని కంపెనీ భావిస్తోంది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







