'మిరాయ్' ట్రైలర్ ఆగస్టు 28న రిలీజ్- సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్
- August 26, 2025
సూపర్ హీరో తేజ సజ్జా, మనోజ్ మంచు, కార్తీక్ ఘట్టమనేని, టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాన్ ఇండియా ఫిల్మ్ 'మిరాయ్' ట్రైలర్ ఆగస్టు 28న రిలీజ్- సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్.
సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ 'మిరాయ్'లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, బిటిఎస్ వీడియో వైబ్ ఉంది సాంగ్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ట్రైలర్ ఆగస్టు 28న లాంచ్ చేయనున్నారు.
హీరో, విలన్ పవర్ ఫుల్ గా కనిపించిన ట్రైలర్ పోస్టర్ అదిరిపోయింది. తేజ సూపర్ యోధాగా ఎనర్జీతో మెరుస్తున్న మ్యాజికల్ స్టిక్ తో కనిపించగా, మనోజ్ ఫెరోషియస్ బ్లాక్ స్వోర్డ్ గా, భారీ ఖడ్గాన్ని పట్టుకుని ఎదురు నిలబడ్డాడు. ఈ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాయి.
ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీయా శరణ్, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను కార్తీక్ స్వయంగా రూపొందించారు. మణిబాబు కరణం రచన, సంభాషణలకు కీలకంగా పని చేశారు. గౌర హరి సంగీతం, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సుజిత్ కుమార్ కొల్లి పని చేస్తున్నారు.
ట్రైలర్ పోస్టర్ ద్వారా మేకర్స్ సినిమాను సెప్టెంబర్ 12న ఎనిమిది భాషల్లో 2డి, 3డి ఫార్మాట్లలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ, మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
సంగీతం: గౌర హరి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీ నాగేంద్ర తంగాల
రైటర్: మణిబాబు కరణం
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్