ఖతార్ లో 650 కి పైగా పాఠశాలల్లో భద్రతా చర్యలు పూర్తి..!!

- August 28, 2025 , by Maagulf
ఖతార్ లో 650 కి పైగా పాఠశాలల్లో భద్రతా చర్యలు పూర్తి..!!

దోహా: 2025-2026 విద్యా సంవత్సరం నేపథ్యంలో ఖతార్ అంతటా 669 పాఠశాలల చుట్టూ భద్రతా పరమైన చర్యలను పూర్తి చేసినట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ‘అష్ఘల్’ తెలిపింది. అదే విధంగా స్కూల్ జోన్లలో అగ్నిమాపక రక్షణ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేసినట్లు  వెల్లడించింది.  స్కూల్ డ్రాప్-ఆఫ్ మరియు పిక్-అప్ సమయాల్లో వాహనదారుల భద్రత, విద్యా సౌకర్యాల సామర్థ్యం పెంపు, భద్రత లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో పనులను పూర్తి చేసినట్టు పేర్కొంది.

140 పాఠశాలల్లో అగ్నిమాపక రక్షణ వ్యవస్థల అభివృద్ధి, విద్యా, వినోద మరియు క్రీడా సౌకర్యాలు వంటి సమగ్ర ప్రణాళికలో భాగంగా అప్డేట్ చేసినట్లు అష్ఘల్ తెలియజేసింది.  విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో 53 పాఠశాలల్లో అభివృద్ధి పనులను చేపట్టినట్టు బిల్డింగ్ ప్రాజెక్ట్స్ డిపార్ట్‌మెంట్ నుండి ప్రాజెక్ట్ ఇంజనీర్ డానా సయీద్ అల్-సయారీ వివరించారు.   

స్కూల్ జోన్ సేఫ్టీ ప్రోగ్రామ్‌లో భాగంగా వివిధ ప్రాంతాలలోని 673 పాఠశాలల చుట్టూ ఉన్న రోడ్ నెట్‌వర్క్‌లను స్కూల్ జోన్ భద్రతా వ్యూహాలు కవర్ చేస్తున్నాయని రోడ్ సేఫ్టీ ఇంజనీర్ అబ్దుల్లా అల్ మరాఘి అన్నారు. పాఠశాల ఎంట్రీ,  మరియు ఎగ్జిట్ ల వద్ద వేగాన్ని తగ్గించమని డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి స్పీడ్ బంప్‌లు, వాకర్స్ క్రాసింగ్‌ల తనిఖీ, నిర్వహణ పనులు చేపట్టినట్లు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com