54 సంస్థలను సీజ్ చేసిన డ్రగ్ అథారిటీ..!!

- August 28, 2025 , by Maagulf
54 సంస్థలను సీజ్ చేసిన డ్రగ్ అథారిటీ..!!

రియాద్: సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) జూలై నెలలో సుమారు 6,000 తనిఖీలు నిర్వహించింది. దాని పర్యవేక్షణలో 4,600 కంటే ఎక్కువ సౌకర్యాలలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 1,137 ఉల్లంఘనలు నమోదు చేసి, ఆయా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 54 సంస్థలను మూసివేయించారు. దీంతోపాటు 52 ఉత్పత్తి లైన్లను సస్పెండ్ చేశారు.  విశ్లేషణ కోసం సుమారు 1,000 నమూనాలను సేకరించారు.

ప్రయోగశాల పరీక్షల్లో ఆహార విషప్రయోగానికి ప్రధాన కారణమైన సాల్మొనెల్లా బ్యాక్టీరియాతో కలుషితమైందని తేలింది. అనంతరం 40 టన్నుల పౌల్ట్రీ ఉత్పత్తులను సౌదీ అరేబియాలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. పౌరులు, నివాసితులు అథారిటీకి సహకరించాలని, ఏవైనా ఉల్లంఘనలు లేదా అతిక్రమణలను 19999 నంబర్ ద్వారా నివేదించాలని డ్రగ్ అథారిటీ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com