హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- August 29, 2025
విశాఖపట్నం: విశాఖపట్నం బీచ్ రోడ్డులో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన హాప్ ఆన్-హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సు సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కందుల దుర్గేష్, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి డబుల్ డెక్కర్ బస్సులో ఆర్కే బీచ్ నుంచి బీచ్ రోడ్డు మీదుగా ప్రత్యేక ప్రయాణం చేశారు.ఈ సందర్భంగా బస్సులో ప్రయాణించిన ముఖ్యమంత్రి పర్యాటకులకు అభివాదం చేస్తూ వారితో మాట్లాడారు.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, విశాఖ పర్యాటక అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన ఈ నూతన సేవ పర్యాటకులకు ఆకర్షణీయంగా, వినోదభరితంగా నిలుస్తుందని తెలిపారు.బీచ్ రోడ్డులోని అందాలను ఆస్వాదించేందుకు ఈ డబుల్ డెక్కర్ బస్సులు పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని అన్నారు.
తాజా వార్తలు
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్