సినీ నట శిక్షకుడు ఎన్.రమణానందరావు కన్నుమూశారు
- July 18, 2016
తెలుగు సినిమా ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్, సినీ నట శిక్షకుడు ఎన్.రమణానందరావు(52) కన్నుమూశారు. బ్రెయిన్‌స్ట్రోక్‌తో వారం రోజుల కిందట ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖకాస్టింగ్ డైరెక్టర్, నట శిక్షకుడైన రమణానందరావు 1964లోజన్మించారు. పస్తుతం నాగోలు సమీపంలోని గణేష్‌నగర్‌లో ఉంటున్నారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కథలు కూడా రాసిన ఆయన.. రవీంద్రభారతి, ఆల్ ఇండియా రేడియోలో నాటకాలు కూడా వేశాడు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ, తేజలతో ఏర్పడిన పరిచయాలతో సినీ పరిశ్రమలో తన ముద్ర వేసుకున్నారు. సినీ నటులకు శిక్షణ కూడా అందించారు. హీరోలు ఉదయ్‌కిరణ్, నితిన్, నవదీప్, నవీన్‌చంద్ర, జైగణిగంటి తదితర నటులు శిక్షణ పొందినట్లు సన్నిహితులు తెలిపారు. సోమవారం సాయంత్రం నాగోలు శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ.పట్నాయక్, సింగర్ సందీప్, నటుడు మధునందన్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









