అలయ్ బలయ్ వేడుకలకు రాష్ట్రపతిని ఆహ్వానించిన దత్తాత్రేయ
- September 01, 2025
న్యూ ఢిల్లీ: హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నేడు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌ను సందర్శించి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆమెను ప్రత్యేకంగా హైదరాబాద్‌లో జరగనున్న ప్రముఖ సాంస్కృతిక కార్యక్రమానికి ఆహ్వానించారు.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించనున్న “అలయ్ బలయ్” కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకావాలని దత్తాత్రేయ కోరారు. ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమం ఉద్దేశాలు, ప్రాధాన్యతపై వివరమైన సమాచారం అందించారు.
అలయ్ బలయ్ పండుగ ప్రకృతి విలువల్ని ప్రతిబింబించేదిగా, విభిన్న ప్రజల మధ్య స్నేహాన్ని, ఐక్యతను పటిష్టం చేసే వేదికగా నిలుస్తుందని దత్తాత్రేయ వివరించారు. ఈ కార్యక్రమం వివిధ రంగాల ప్రముఖులను ఒకచోట చేర్చి మతసామరస్యాన్ని, సాంస్కృతిక ఐక్యతను చాటేదిగా ఉంటుంది.
బండారు దత్తాత్రేయ వివరాలను సంతోషంగా విన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలయ్ బలయ్ వంటి పౌర సంబంధాల కార్యక్రమాలు సామాజిక విలువలను పెంపొందించేందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయం అని తెలిపారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







