మలేసియా తెలుగు ఫౌండేషన్ మీట్ & గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న మురళీ మోహన్, ప్రదీప్
- September 02, 2025
కౌలాలంపూర్: మలేసియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత పార్లమెంట్ మాజీ సభ్యులు మాగంటి మురళీ మోహన్ మరియు ప్రముఖ తెలుగు నటుడు ప్రదీప్ సన్మానార్థంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ విందుకు స్థానిక ఎన్ఆర్ఐ సంఘాల ప్రతినిధులు, ముఖ్యంగా TEAM (తెలుగు ఎక్సపెట్స్ అసోసియేషన్) కోశాధికారి డాక్టర్ నాగరాజు సూర్యదేవర, FNCA-Malaysia ( ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్–మలేసియా) అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, BAM (భారతీయ అసోసియేషన్ అఫ్ మలేషియా ) ప్రెసిడెంట్ సత్య, MYTA (మలేషియా తెలంగాణ అసోసియేషన్) జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్ మరియు ఇతర ప్రముఖ సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మురళీ మోహన్ గారు మలేసియాలోని భారతీయ ప్రవాసుల జీవన పరిస్థితులపై చర్చించారు. ప్రత్యేకంగా తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు, వారికి ఎదురవుతున్న కష్టాలు పై విచారణ చేశారు. కొత్తగా వచ్చిన ప్రవాస భారతీయులకు సహాయం అందించాలని విజ్ఞప్తి ఆయన చేశారు.
“మలేసియాలో కొత్తగా వచ్చే ప్రవాసులకు ఉద్యోగ అవకాశాలు, తాత్కాలిక ఆశ్రయం, అవసరమైన మద్దతు అందించడంలో మనందరం కలిసి పనిచేయాలి.మనలో ప్రతి ఒక్కరి భాద్యత ఇది,” అని మురళీ మోహన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు ప్రదీప్ పాల్గొనడం వలన మరింత ఆకర్షణ ఏర్పడింది. ఆయన సంఘ సభ్యులతో సానుకూలంగా మమేకమయ్యారు.
తాజా వార్తలు
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్