లండన్‌లో ఘోర ప్రమాదం..ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం
- September 03, 2025
లండన్: లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వినాయక నిమజ్జనం వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్‌కు చెందిన తర్రె చైతన్య, రిషితేజగా గుర్తించారు. లండన్‌లో నివాసం ఉంటున్న కొంతమంది తెలుగు విద్యార్థులు వినాయక నిమజ్జనంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరి కారును వేరొక కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చైతన్య, రిషితేజ అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరూ హైదరాబాద్‌లోని నాదర్‌గుల్, ఉప్పల్ ప్రాంతాలకు చెందినవారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులంతా తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని సమాచారం. ఈ ఘటనతో హైదరాబాద్‌లో విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు
తాజా వార్తలు
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!







