ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి, పలువురికి గాయాలు..!!
- September 04, 2025
దుబాయ్: సోమవారం మధ్యాహ్నం ఎమిరేట్స్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒక వాహనదారుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
షార్జాకు వెళ్లే మార్గంలో దుబాయ్ క్లబ్ బ్రిడ్జీ దాటగానే మూడు వాహనాల పరస్పరం ఢీకొన్నాయి. డ్రైవర్లు చాలా దగ్గరగా డ్రైవ్ చేయడం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రమాద ఫోటోలో ఒక సెడాన్ మరియు ఒక మినీ ట్రక్కు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ప్రాథమిక దర్యాప్తులో ఒక డ్రైవర్ ముందున్న వాహనం నుండి తగినంత దూరంలో లేడని ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని తమ విచారణలో తేలిందని దుబాయ్ పోలీసుల జనరల్ ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు.
దుబాయ్ రోడ్లలో తగినంత దూరం వదలకపోవడం వల్ల వెనుక నుండి వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదాలు చాలా తరచుగా జరుగుతాయని బ్రిగేడియర్ జుమా పేర్కొన్నారు. ఫెడరల్ ట్రాఫిక్ చట్టాల ప్రకారం.. ఇలాంటి నేరాలకు పాల్పడిన డ్రైవర్లకు 400 దిర్హామ్ల జరిమానా మరియు నాలుగు బ్లాక్ పాయింట్లను విధిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







