24శాతం పెరిగిన సౌదీ ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లో..!!

- September 04, 2025 , by Maagulf
24శాతం పెరిగిన సౌదీ ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లో..!!

రియాద్: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) ఆకర్షించడానికి సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి. 2024లో ఇన్‌ఫ్లోలు 24.2 శాతం పెరిగి SR119.2 బిలియన్లకు చేరుకున్నాయి. 2017లో SR501.8 బిలియన్లతో పోలిస్తే, FDI స్టాక్ దాదాపు రెట్టింపు అయి SR977.3 బిలియన్లకు చేరుకుంది.

క్రౌన్ ప్రిన్స్,  ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ 2021లో ప్రారంభించిన జాతీయ పెట్టుబడి వ్యూహాలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయని సౌదీ అరేబియా పెట్టుబడుల మంత్రి ఖలీద్ అల్-ఫలిహ్ తెలిపారు. ప్రపంచ కంపెనీలు తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలను సౌదీకి తరలించేందుకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొంటున్నారు.  మొత్తం పెట్టుబడుల్లో 76 శాతం ప్రభుత్వ, చమురుయేతర ప్రైవేట్ రంగంలోనే వచ్చాయని తెలిపారు. 

ఇదే కాలంలో విభిన్న రంగాలకు చెందిన దాదాపు  50వేల కంటే ఎక్కువ విదేశీ పెట్టుబడి లైసెన్సులను జారీ చేసినట్లు వెల్లడించారు.  సౌదీ అరేబియా విజన్ 2030 లక్ష్యాలను సాధించడానికి అవసరమైన వృద్ధి, ఆర్థిక వైవిధ్యీకరణను వేగవంతం చేయనున్నట్లు పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com