లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ విధుల్లో చేరిక

- September 04, 2025 , by Maagulf
లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ విధుల్లో చేరిక

తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల సలహాదారుడిగా నియమితులైన లెఫ్టినెంట్ జెనరల్ కల్నల్ హార్పల్ సింగ్ విధుల్లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసేందుకు రూపొందించిన ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణ నిమిత్తం బుధవారం రోజున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు లెఫ్టినెంట్ జెనరల్ హార్పల్ సింగ్ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జ, సలహాదారు ఆదిత్యా దాస్ నాధ్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ లతో పాటు ఇ.ఎన్.సి లు అంజద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేష్ బాబు లను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు.

టన్నెల్ నిర్మాణంలో నైపుణ్యం
సివిల్ ఇంజినీరింగ్ లో పట్టభద్రుడైన లెఫ్టినెంట్ జెనరల్ హార్పల్ సింగ్ టన్నెల్ నిర్మాణ రంగంలో అపార అనుభవం గడించిన దృష్ట్యా ఆయనను ఈ శాఖలో నియమించిన విషయం విదితమే. ముఖ్యంగా మూడు లక్షల ఎకరాలకు సాగు నీటితో పాటు ఫ్లోరోసిస్ బారిన పడిన నల్లగొండ జిల్లా ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు ఉద్దేశించబడిన ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గం తవ్వకంలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం లెఫ్టినెంట్ జెనరల్ హార్పల్ సింగ్ అనుభవాన్ని వినియోగించుకునేందుకు వీలుగా ఈ నియామకం చేపట్టారు.

SLBC ప్రాజెక్ట్ ప్రాధాన్యత
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఎస్.ఎల్.బి.సి పనులు పూర్తి చేసి త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించిన నేపధ్యంలో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సొరంగ మార్గం తవ్వకాలలో అపార అనుభవం గడించిన హార్పల్ సింగ్ సేవలు వినియోగించుకోనుంది.

హార్పల్ సింగ్ ఈ నియామకం ఎందుకు పొందారు?
సొరంగ మార్గం తవ్వకాలలో, టన్నెల్ నిర్మాణంలో అపార అనుభవం కలిగినందువల్ల SLBC ప్రాజెక్ట్‌కి ఆయనను సలహాదారుగా నియమించారు.

SLBC ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
మూడు లక్షల ఎకరాలకు సాగు నీరు మరియు నల్లగొండ జిల్లాకు సురక్షితమైన త్రాగునీరు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com