పాలస్తీనియన్లను తరిమికొట్టాలన్న ఇజ్రాయెల్ పిలుపును ఖండించిన GCC..!!

- September 06, 2025 , by Maagulf
పాలస్తీనియన్లను తరిమికొట్టాలన్న ఇజ్రాయెల్ పిలుపును ఖండించిన GCC..!!

రియాద్: పాలస్తీనియన్లను వారి భూమి నుండి తరిమికొట్టాలన్న ఇజ్రాయెల్ పిలుపులను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) తీవ్రంగా ఖండించింది. ఇది అన్ని అంతర్జాతీయ నిబంధనలు మరియు చట్టాలను ఉల్లంఘించడమేనని చెప్పింది.
పాలస్తీనా ప్రజలను వారి భూమి నుండి ఎవరు వెళ్లగొట్టలేరని, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి జారీ చేసిన బాధ్యతారహితమైన మరియు ప్రమాదకరమైన ప్రకటనలను GCC సెక్రటరీ జనరల్ జాసెం మొహమ్మద్ అల్బుదైవి ఒక ప్రకటనలో ఖండించారు. అంతర్జాతీయ సమాజం దీనిపై స్పందించాలని, అన్ని దేశాలు ఈ ప్రమాదకరమైన పద్ధతులు, ప్రకటనలను ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యాయమైన, సమగ్ర శాంతిని సాధించడానికి తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దులలో స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని స్థాపించే అవకాశాలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com