జులై లో 8,700 ఎమర్జెన్సీ కాల్స్..!!

- September 06, 2025 , by Maagulf
జులై లో 8,700 ఎమర్జెన్సీ కాల్స్..!!

మనామా : జూలై నెలలో 8,700 అత్యవసర సేవలకు సంబంధించి కాల్స్ వచ్చాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో 4,979 జాతీయ అంబులెన్స్ కాల్స్, 2,352 అత్యవసర పోలీసు పెట్రోల్స్ కాల్స్ ఉన్నాయి. 5 శాతం భద్రతా కేసులు, 31 శాతం ట్రాఫిక్ విషయాలు మరియు 64 శాతం ఇతర సంఘటనల కాల్స్ వచ్చాయని నివేదిక తెలిపింది. 
అలాగే, కోస్ట్ గార్డ్ 162 నివేదికలను పరిష్కరించింది. వాటిలో 105 రెస్క్యూ కార్యకలాపాలు మరియు నౌక బ్రేక్ డౌన్లు, 11 సముద్ర ప్రమాదాలు ఉన్నాయి. సివిల్ డిఫెన్స్ 1,207 కాల్స్ కు స్పందించింది. వాటిలో 222 అగ్నిప్రమాదాలు, 575 సహాయ అభ్యర్థనలు, 112 ట్రాఫిక్ ప్రమాదాల కాల్స్ ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 
ఇక, జాతీయ అంబులెన్స్ లో మొత్తం 3,647 వైద్య కేసులు, ప్రైవేట్ ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాల నుండి 476 బదిలీలు, 394 ట్రాఫిక్ ప్రమాదాలు, 31 అగ్నిప్రమాదాలు మరియు 431 ఇతర సంఘటనలకు సంబంధించిన కాల్స్ నిర్వహించినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com