సంస్కరణల పాలన అందించిన ఇఒ శ్యామలరావు బదిలీ
- September 09, 2025
తిరుమల: తిరుమల : తిరుమల తిరుపతిదేవస్థానం కార్యనిర్వహణా ధికారి(EO) జె. శ్యామలరావు బదిలీ అయ్యారు. సీనియర్ ఐఎఎస్ అధికారిగా ఉన్న అనుభవంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఏడాది జూన్ 16న రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శి స్థానం నుండి టిటిడి ఇఒగా శ్యామలరావును నియమించారు. గత ఏడాది టిటిడిలో ఉన్న అస్తవ్యస్థ పాలన, గాడితప్పిన అనేక పథకాలను చక్కబెట్టేందుకు శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలకనుగుణంగా శ్యామలరావు గత 15నెలల పాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ముఖ్యంగా సామాన్యభక్తులు అన్నప్రసాదాలపై తీవ్ర అసంతృప్తి చెందేవారు, అంతేగాక రుచిగా శుచిగా లేవనే ఫిర్యాదులు అందాయి.
నెయ్యిమిశ్రమం
ఏడుకొండల స్వామి లడ్డూ ప్రసాదాల నాణ్యత సరిగా లేదని,నెయ్యివాసన, రుచి లేకపోయిందని, కుంకు మపువ్వు, యాలకులు, నెయ్యిమిశ్రమం కూడా వాడటంలేదని, చక్కెరశాతం ఎక్కువగా ఉందనే ఫిర్యాదులు భక్తుల నుండి వెల్లువెత్తాయి. అప్ప ట్లోనే గత ఐదేళ్ళ వైసిపి పాలనలో టిటిడి ధర్మ కర్తలమండలి పెద్దలు, అప్పటి అధికారులు కల్తీ నెయ్యిని వినియోగించి లడ్డూలు తయా రుచేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సమగ్రంగా ఆటు పోటు కార్మికులను ఇటు వైష్ణవబ్రాహ్మణులతో సమన్వయంగా సమావేశం నిర్వహించి పలు అంశాలపై దర్యాప్తు చేపట్టారు. ఏకంగా కల్తీ నెయ్యి వాడారనే బాగోతంపై లోతుగా దర్యాప్తుచేయించి ఆధారాలను వెలికితీశారు. ఇంకా టిటిడిలో పలు సంస్కరణలు చేపట్టారు.
వైకుంఠ ద్వారదర్శనాలకు సంబంధించి
టిటిడిలో అన్యమత ఉద్యోగులకు విఆర్ఎస్. ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ వ్యవహారం, ఉద్యోగులకు నేమ్బ్యడ్జ్లు అమలువంటివి చైర్మన్ నాయుడుతో విబేధించారు. అయితే దురదృష్టవశాత్తు టిటిడి పాలనపై పూర్తిగా పట్టు సాధించలేకపోయిన శ్యామలరావు నేతృత్వంలో ఈ ఏడాది జనవరిలో వైకుంఠద్వారదర్శనాలకుసంబంధించి ఆఫ్లైన్లో తిరుపతిలో టోకెన్లు జారీ ఘటనలో అవగాహన లేక, క్రిందిస్థాయి అధికారుల అత్యుత్సాహంతో ప్రమాదం తప్పిదం జరిగింది. దీంతో ఆరుగురు భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లోనే ఈ ఘటనపై టిటిడి చైర్మన్ బిఆరా నాయుడుకు, ఇఒ శ్యామలరావుకు మధ్య సమన్వయం లేకపోయింది. అధికారుల తప్పిదం వల్లనే ఈ దారుణం జరిగిందని, తనకు మాటవరుసకైనా ఇఒ విషయాలు చెప్పలేదనేది సిఎం చంద్రబాబు తిరుపతి పర్యటనలో ఆయన ఎదుటే మాట మాట చేసుకున్నారు.
ప్రిన్సిపల్ కార్యదర్శిగా
దీన్ని అప్పట్లోనే సిఎం తీవ్రంగా తీసుకున్నా చేసేది ఏమీ లేక శ్యామలరావును కొనసాగించారు. అయితే టిటిడిలో తిరుమలలో ఇఒగా శ్యామలరావు అటు చైర్మన్తో విభేధిస్తున్నాడనేది ప్రధానమైన ఆరోపణ. ఈ నేపధ్యంలో తాజాగా 11మంది ఐఏఎస్ల బదిలీల్లో టిటిడి ఇఒ శ్యామలరావు జిఎడిలొ ప్రభుత్వ పొలిటికల్ ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమించారు. దీంతో దేవదేవుని బ్రహ్మోత్సవాలకు ముందు ఇఒ బదిలీ మాత్రం సంచలనమే.సహజంగా రాష్ట్రప్రభుత్వ పరిపాలనలో ప్రధాన కార్యదర్శి హోదాకంటే ధార్మికసంస్థ తిరుమల తిరుపతిదేవస్థానంలో కార్యనిర్వహణాధికారి(EO) గా పనిచేసే భాగ్యం జీవితంలో అధికారికి అయినా మరచిపోలేని అనుభూతి.
దేవుని చెంత ప్రతి భక్తుడి
అలాంటిది ఏడుకొండల వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఇది బదిలీ జరగడం మాత్రం ఆయన జీర్ణించుకోలేని పరిస్థితి. దేవునికి దగ్గరుండి సేవచేసుకునే భాగ్యం కలిగించుకోవడం నిజంగా అదృష్టమే. అలాంటిది సరిగ్గా ఉత్సవాలకు ముందే ఆయన బదిలీ అనివార్యమైంది. గత ఏడాది జూన్ 16న ఇఒగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు తనదైనశైలిలో దేవుని చెంత ప్రతి భక్తుడిలో సంతోషం చూసేలా పనిచేస్తానని, సామాన్య భక్తుడికి ఇబ్బంది లేకుండా సౌకర్యాలుకల్పి స్తానని, సిఎం విజన్ 2047కు తగ్గట్లు తిరుమ లలో పాలన చేస్తానని చెప్పిన శ్యామలరావు అందుకు అవసరమైన కీలక చర్యలు తీసుకో వడంలో ఆయన సాహసం చేయలేకపోయారనేది ఉద్యోగవర్గాల్లో గుప్పుమంటోంది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









