నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా..
- September 09, 2025
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. నేపాల్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి దిగిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా నిషేధంపై ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ముగ్గురు మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసినప్పటికీ నిరసనలు తగ్గుముఖం పట్టలేదు. ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా రాజీనామా చేయాలంటూ ఆ దేశంలోని యువత ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ క్రమంలో రాజధానిలోని ఓలి అధికారిక నివాసాన్ని నిరసనకారులు ముట్టడించారు. ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అంతేకాదు.. ఇంటికి నిప్పుపెట్టారు.
ప్రధాని ఓలీ నివాసంతోపాటు సీనియర్ రాజకీయ నేతల ఇళ్లు, కార్యాలయాలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇళ్లపై దాడులు చేస్తున్నారు. దీంతో నేపాల్ లో రాజకీయ సంక్షోభంతోపాటు.. నిరసనల ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, సైన్యం సూచన మేరకు ఆయన ప్రధాని పదవికి తన రాజీనామాను ప్రకటించినట్లు తెలిసింది.
యువత నిరసనల నేపథ్యంలో నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ తో ప్రధాని కేపీ శర్మ ఓలీ మాట్లాడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ క్లిష్ట పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు, ప్రధాని నివాసం నుంచి సురక్షితంగా వెళ్లిపోయేందుకు మిలిటరీ సహాయం కావాలని ఆయన నేపాల్ ఆర్మీ చీఫ్ ను అడిగినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!