యూఏఈలో డ్రైవర్‌లెస్ కార్ల డెలివరీలు..!!
- September 09, 2025
యూఏఈ: అత్యాధునిక డ్రైవర్‌లెస్ టెక్నాలజీకి యూఏఈ కేంద్రంగా మారుతోంది. ప్రయాణికులను ట్రాన్స్ పోర్ట్ చేసేముందు ఆటోమెటిక్ టాక్సీల నుండి డ్రైవర్లు లేకుండా కస్టమర్లకు వస్తువులను తీసుకువచ్చే డెలివరీ వాహనాల వరకు ఉన్నాయి.
దుబాయ్ వాణిజ్యం, రవాణా మరియు లాజిస్టిక్స్ హోల్డింగ్ గ్రూప్ 7X ఈమేకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక సంవత్సరంలో యూఏఈ అంతటా స్వంతంగా వాహనాల ద్వారా డెలివరీలను ప్రారంభించాలని యోచిస్తోస్తున్నట్టు దని దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. కంపెనీ ప్రస్తుతం అబుదాబిలోని మస్దార్ నగరంలో ఆటోమెటిక్ వాహనాల ట్రయల్స్ నిర్వహిస్తోంది. వినియోగదారులకు ఉత్పత్తులను పంపిణీ చేస్తోంది.
“మస్దార్ నగరంలో ఇప్పటికే కొన్ని ఆటోమెటెడ్ ట్రక్కులు డెలివరీలు చేస్తున్నాయి. త్వరలోనే దీనిని ఖలీఫా సిటీకి విస్తరిస్తాము. ఆ తర్వాత దుబాయ్‌లో కూడా మరో ట్రయల్ నిర్వహిస్తాం. ఒక సంవత్సరంలో తాము ఆ వాహనాలను యూఏఈ అంతటా రోడ్లపై పెడతాము ”అని 7X గ్రూప్ CEO తారిక్ అల్ వహేది అన్నారు.
ఏప్రిల్‌లో యాంగో టెక్నాలజీ ఫుడ్, టెక్ సంస్థ రూట్స్ అండ్ రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీతో భాగస్వామ్యంతో శోభా హార్ట్‌ల్యాండ్‌లో 30 నిమిషాల లోపు 22 కిలోమీటర్ల పరిధిలో ఆర్డర్లను డెలివరీ చేయనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







