టర్కీలో 42 సైనిక హెలికాప్టర్లు అదృశ్యం

- July 19, 2016 , by Maagulf
టర్కీలో 42 సైనిక హెలికాప్టర్లు అదృశ్యం

టర్కీలో 42 సైనిక హెలికాప్టర్లు అదృశ్యం కావడం తీవ్ర సంచలనం సృష్టించింది. గత వారం జరిగిన సైనిక తిరుగుబాటు నుంచి ఈ హెలికాప్టర్లు జాడ తెలియకుండా పోయిందని అధికారవర్గాలు తెలిపాయి. దీంతో మరో సారి తిరుగుబాటు తలెత్తే అవకాశం లేకపోలేదని కొందరు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత వారం జరిగిన సైనిక తిరుగుబాటులో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో పాటు మరో మూడువేల మంది గాయపడిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు ఎర్డొగాన్‌కు వ్యతిరేకంగా జరిగిన సైనిక తిరుగుబాటును ప్రజలు అడ్డుకోవడంతో సైనిక కుట్ర విఫలమైన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com