హీరోయిన్ రితికా నాయక్ తో మాగల్ఫ్ ముఖాముఖీ
- September 10, 2025
సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రితికా నాయక్ విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ ప్రాజెక్టు లోకి ఎలా వచ్చారు?
-నా తొలి చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ కోసం చూస్తున్నప్పుడుమిరాయ్ అవకాశం వచ్చింది. అద్భుతంమైన కథ. నా క్యారెక్టర్ చాలా నచ్చింది.
-ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను. చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చేశాం.ఫైనల్ గా సినిమా ఆడియన్స్ కి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?
-చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను. హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్. తనలో గ్రేట్ ఎనర్జీ ఉంటుంది. ఇందులో నా క్యారెక్టర్ గురించి అప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు. మిరాయ్ లో యాక్షన్ అడ్వంచర్ ఆడియన్స్ గొప్ప అనుభూతిని ఇస్తుంది.
తేజసజ్జాతో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-తేజ చాలా ప్రొఫెషనల్. వెరీ స్వీట్. డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్లో చాలా గాయాలు అయ్యాయి. కొన్నిసార్లు అనారోగ్యం కూడా చేసింది. అయినప్పటికీ ఆయన కరెక్ట్ టైం కి సెట్ లో ఉండేవారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
- మనోజ్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆఫ్ స్క్రీన్ ఆయన చాలా ఫన్ ఫుల్ గా ఉంటారు. చాలా స్వీట్ పర్సన్.
-ఈ సినిమాలో జగపతిబాబుతో కలిసి వర్క్ చేయడం కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. శ్రీయా గారితో కలిసి స్క్రీన్స్ షేర్ చేసుకోవడం మంచి ఎక్స్పీరియన్స్. చాలా అద్భుతమైన నటీనటులు ఈ సినిమాలో పనిచేశారు. వాళ్ళ అందరితో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఈ జర్నీ చాలెంజింగ్ గా అనిపించిందా?
-ఈ సినిమాలో దాదాపు 80% లైవ్ లొకేషన్స్ లో షూట్ చేశాం. ప్రతి రియల్ టైమ్ లొకేషన్స్ లోకి వెళ్లడం వెరీ చాలెంజింగ్. అయితే మా టీమ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తో జర్నీ చాలా అద్భుతంగా జరిగింది.
డైరెక్టర్ కార్తీక్ గారి గురించి? -కార్తీక్ చాలా విజన్ ఉన్న డైరెక్టర్. ఆయన సెట్ లో చాలా క్లారిటీగా ఉంటారు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. మా ఇద్దరి బర్త్ డేస్ కి ఒక్క రోజు గ్యాప్.సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్ళు.(నవ్వుతూ)
మ్యూజిక్ గురించి?
-హరి గౌర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.ఈ సినిమాలో పాటలు విజువల్ గా చాలా అద్భుతంగా ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
మీకు ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
-కథలో ప్రాధాన్యత ఉన్న అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వుండే అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
అలాగే నాకు సూపర్ హీరో మూవీస్ అంటే చాలా ఇష్టం. హనుమాన్ నాకు చాలా ఇష్టమైన సినిమా. యాక్షను రొమాన్స్ నా ఫేవరెట్ జోనర్స్.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్స్ గురించి?
-చాలా పాషన్ ఉన్న నిర్మాతలు. చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్ గా తీశారు.
మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు?
-నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం.ఫిదా చూసి ఫిదా అయిపోయా.తనే నా ఇన్స్పిరేషన్.
కొత్తగా చేస్తున్న సినిమాలు గురించి?
-వరుణ్ తేజ్తో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. మేకర్స్ తెలియజేస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!