నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక

- September 11, 2025 , by Maagulf
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక

నేపాల్: ఎట్టకేలకు నేపాల్ లో రాజకీయ అనిశ్చితికి తెరదించింది. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆయన పేరును జెన్-జెడ్ ప్రతిపాదించగా.. అన్ని వర్గాల నుంచి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. కుల్మన్ గతంలో నేపాల్ విద్యుత్ బోర్డు కు ఎండీగా పనిచేశారు. ఆయన నియామకంపై తుదినిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాపై నిషేధం,విధించడంతో నేపాల్ లో అల్లర్లు చెలరేగిన సంగతి విధితమే. యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈఆందోళన కాస్త హింసాత్మకగా మారింది. దేశ ప్రధాని, పార్లమెంట్, ఇతర మంత్రుల నివాసలకు నిప్పు పెట్టారు. మంత్రులపైభౌతిక దాడులకు పాల్పడ్డారు. దీంతో పాలకులు తమ ప్రాణాలను దక్కించుకునేందుకు ఇతర దేశాలకు పారిపోయారు.

సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ పై నిషేధం విధించడంలో నేపాల్ లో జెన్ జెడ్ ఉద్యమం (Nepal’s Gen Z movement) ఆరంభమైంది. దీనితోపాటు ప్రభుత్వ,పెద్దల అవినీతి, అక్రమాలపై యువత ఉద్యమించింది. పలుచోట్ల ఆందోళనకారులు ప్రబుత్వ ఆస్తులకు నష్టం చేయడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీంతో సైన్యం రంగంలోకి దిగింది. ఆందోళనల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలితో సహాపలువురు మంత్రులు, దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ సైతం తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో అందరి,ఆమోదయోగ్యుడైన కుల్మన్ సింగ్ కు దేశ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. దేశంలో విద్యుత్ కోతలకు చరమగీతం పాడిన,వ్యక్తిగా, అవినీతి మరకలేని స్వచ్ఛమైన నేతగా ఆయనకు మంచి పేరుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com