భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!

- September 11, 2025 , by Maagulf
భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!

 యూఏఈ: ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది. ఈ పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది. అయితే, భారత్ జట్టుతో మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది.

ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్ జట్టు తన తొలి మ్యాచ్ ను బుధవారం యూఏఈ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్ లో అద్భుత విజయాన్ని టీమిండియా నమోదు చేసింది. యూఏఈ జట్టుపై తొమ్మిది వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో మంచి ఫామ్‌లో ఉండటంతో పాకిస్థాన్ తో ఆదివారం జరిగే మ్యాచ్ లోనూ విజయం సాధిస్తుందని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు.. టీమిండియాను ఓడించాలనే పట్టుదలతో ఉన్న పాకిస్థాన్ జట్టుకు మ్యాచ్‌కు ముందే బిగ్ షాక్ తగిలింది.

ఆసియా కప్ టోర్నీలో భాగంగా పాకిస్థాన్ జట్టు తన తొలి మ్యాచ్‌ను శుక్రవారం (సెప్టెంబర్ 12న) ఒమన్ జట్టుతో ఆడనుంది. అయితే, ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు గాయం కావడంతో ఒమన్, భారత్ జట్లతో జరిగే మ్యాచ్‌కు దూరమైనట్లు సమాచారం. బుధవారం దుబాయ్ లోని ఐసీసీ అకాడమీలో జరిగిన శిక్షణా సెషన్‌కు అతను దూరంగా ఉన్నాడు. మిగిలి జట్టు సభ్యులు ప్రాక్టీస్ చేశారు. జియో న్యూస్ రిపోర్ట్ ప్ర‌కారం.. ప్రాక్టీస్ సెషన్ లో సల్మాన్ ఆఘా నెక్ బ్యాండ్‌తో కనిపించినట్లు, జట్టుతోపాటు ఐసీసీ అకాడమీకి వెళ్లినప్పటికీ అతడు ఎటువంటి ప్రాక్టీస్ లోనూ పాల్గొనలేదట. అయితే, భారత్ జట్టతో మ్యాచ్ కు ముందు కెప్టెన్ సల్మాన్ గాయం భారిన పడడంతో పాకిస్థాన్ శిబిరంలో ఆందోళన నెలకొంది.

సల్మాన్ అలీ ఆఘా ప్రస్తుతం మెడ నొప్పితో బాధపడుతున్నాడని, ముందు జాగ్రత్తలో భాగంగానే అతడు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనకుండా విశ్రాంతి తీసుకున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే, శుక్రవారం సాయంత్రం ఒమన్ జట్టుతో జరిగే మ్యాచ్ లో సల్మాన్ ఆడకుంటే భారత్ జట్టుతో జరిగే మ్యాచ్‌లోనూ ఆడే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. అదే జరిగితే భారత్ లాంటి పటిష్ఠమైన జట్టును ఎదుర్కొనే సమయంలో కెప్టెన్ తుది జట్టులో లేకపోవటంతో పాకిస్థాన్ జట్టుకు భారీగా దెబ్బేనని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పాకిస్థాన్ క్రికెట్ వర్గాలు మాత్రం.. సల్మాన్ ఒమన్ జట్టుతో మ్యాచ్ లో ఆడకపోయినా ఇండియాతో జరిగే మ్యాచ్ లో ఆడతాడని చెబుతున్నాయి.

ఆసియాకప్‌కు పాక్ జట్టు
సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్, హారిస్ రవూఫ్‌, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వాసిమ్ జూనియర్, షహిబ్‌జాద ఫర్హాన్, సయామ్ ఆయుబ్, సల్మాన్ మిర్జా, షహీన్ షా అఫ్రిది, సుఫ్‌యాన్ మోకిమ్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com